ప్రస్తుతం సినిమా థియేటర్లలో ఎటుచూసినా అంతా శూన్యమే కనిపిస్తోంది. కారణం కరోనా వైరస్ అని చెప్పవచ్చు. అయితే లాక్‌డౌన్ పూర్తికాగానే ప్రభుత్వంతో చర్చలు జరుపుతారట. జులై చివరి వారం నాటికి సినిమా థియేటర్లు తెరుచుకోనున్నాయనే వార్తలు కూడా వస్తున్నాయి. అయితే అక్కడ కూడా సామాజిక దూరంతోనే ప్రేక్షకులు కూర్చోవలసి ఉంటుందని చెప్పుకుంటున్నారు. 500 మంది పట్టే థియేటర్లో కేవలం యాభై శాతం మాత్రమే అనుమతి ఇస్తారనే ఉహాగానాలు వస్తున్నాయి.
అయితే ఇప్పటికే బాలీవుడ్ అగ్రహీరోల సినిమాలు తమ విడుదల తేదీలను మార్చుకోగా, మరికొన్ని ఓటీటీల ద్వారా కూడా విడుదల కానున్నాయి. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ నటిస్తున్న 'రాధే: యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్'తో పాటు మరో హీరో అక్షయ్ కుమార్ పోలీస్ అధికారిగా నటిస్తున్న చిత్రం 'సూర్యవంశీ'. అంతా సవ్యంగా జరిగితే ఈపాటికే ఈ చిత్రాలు అభిమానులను అలరించేవి.