అల్లు అర్జున్ కథానాయకుడిగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'అల వైకుంఠపురములో'. సంక్రాంతి కానుకగా తెలుగు, తమిళ ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ వసూళ్లు అందుకున్న ఈ సినిమాను బాలీవుడ్లో రీమేక్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయట.
'అల వైకుంఠపురములో' చిత్రంలో సల్మాన్..! - సల్మాన్ ఖాన్ అలవైకుంఠపురములో
'అల వైకుంఠపురములో' చిత్రంలో సల్మాన్ ఖాన్ ఏంటి అనుకుంటున్నారా? సినిమా చూశాం.. మాకు ఎక్కడ కనిపించలేదు అని సందేహ పడుతున్నారా. అది తెలుగులో కాదు బాలీవుడ్లో. 'అల వైకుంఠపురములో' చిత్రాన్ని బాలీవుడ్లో రీమేక్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట.
మాటలు, పాటలతో మ్యాజిక్ చేసిన ఈ సినిమాను హిందీ ప్రేక్షకులకు రుచి చూపించేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయట. బన్నీ పాత్రను సల్మాన్ పోషించబోతున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. సల్మాన్ కూడా ఈ రీమేక్‌లో నటించేందుకు ఇష్టంగా ఉన్నట్లు తెలుస్తోంది. సుశాంత్ పాత్ర కోసం మరో కథానాయకుడిని వెతికే పనిలో ఉన్నారట. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుందని బాలీవుడ్ మీడియా తెలిపింది. దర్శకుడు, ఇతర తారాగణం ఎవరో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
ఇదీ చదవండి: 'ఖైదీ' బాలీవుడ్ రీమేక్‌లో హృతిక్‌రోషన్!