తెలంగాణ

telangana

By

Published : Sep 7, 2019, 11:56 AM IST

Updated : Sep 29, 2019, 6:18 PM IST

ETV Bharat / sitara

వర్షంలో సైకిల్​పై​ సల్మాన్​ఖాన్ సవారీ​!

వర్షం పడుతున్న సమయంలో 'దబాంగ్-3' షూటింగ్​కు సైకిల్​పై వెళ్లాడు హీరో సల్మాన్ ఖాన్. ఈ వీడియోను ట్విట్టర్​లో షేర్ చేశాడు.

సల్మాన్

సెలబ్రిటీలు అంటే లగ్జరీ కార్లతో.. బయటకొచ్చేటపుడు హంగు ఆర్భాటాలతో వస్తారని అనుకుంటారు చాలామంది. అందులో హీరోల పరిస్థితి ఇంకా ప్రత్యేకం. కానీ బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్​ఖాన్..​ సాధారణ వ్యక్తిలా సైకిల్​పై సందడి చేశాడు. ముంబయిలోశుక్రవారం భారీగా వర్షం కురుస్తున్న సమయంలో 'దబాంగ్-3' షూటింగ్​కు ఈ ద్విచక్రవాహనం​పై వెళ్లాడు.

ట్రాఫిక్​ ఎక్కువగా ఉన్నప్పటికీ సైకిల్​పై దూసుకుపోయాడు సల్మాన్. మధ్యమధ్యలో అభిమానులతో సెల్ఫీలు దిగుతూ.. సందడి చేశాడు. నిమిషం పాటు సాగే ఈ వీడియోను ట్విట్టర్​లో పంచుకున్నాడు.

"ముంబయి నగరంలో భారీ వర్షాలు.. 'దబాంగ్-3' షూటింగ్​ కోసం లొకేషన్​కు ఇలా వెళ్తున్నా" -సల్మాన్ ఖాన్​

ప్రభుదేవా దర్శకత్వం వహిస్తున్న 'దబాంగ్-3' చిత్రాన్ని సల్మాన్ సోదరుడు అర్బాజ్​ ఖాన్ నిర్మిస్తున్నాడు. డిసెంబరు 20న ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా. ఇంతకుముందు ఇదే దర్శకుడితో 'వాంటెడ్' సినిమా చేశాడు సల్మాన్.

ఇదీ చదవండి: "ప్లాస్టిక్ నివారణపై ముందడుగేద్దాం"

Last Updated : Sep 29, 2019, 6:18 PM IST

ABOUT THE AUTHOR

...view details