సల్మాన్ ఖాన్.. సామాజిక మాధ్యమాల్లో వినూత్న వీడియోలు పెడుతూ అభిమానులను అలరిస్తుంటాడు. తాజాగా ప్లాస్టిక్ సీసాల్లోని మంచి నీళ్లు తాగొద్దంటూ ప్రజలను చైతన్యపరిచే వీడియోను ఇన్ స్టాలో పంచుకున్నాడు.
ఓ వానరానికి ప్లాస్టిక్ సీసాలో మంచి నీరు ఇస్తే.. అది ఆ నీటిని తిరస్కరిస్తుంది. అనంతరం గ్లాస్లో మంచి నీళ్లు ఇవ్వగా.. ఆ గ్లాస్ నీటిని స్వీకరించి తన దాహార్తిని తీర్చుకుంటుంది. వెంటనే స్పందించిన సల్మాన్ "భజరంగీ భాయ్ జాన్' ప్లాస్టిక్ బాటిల్లో పానీ నహీ పీతా(భజరంగీ భాయ్ జాన్ ప్లాస్టిక్ సీసాల్లో మంచి నీళ్లు తాగట్లేదు )" అంటూ ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు.