తెలంగాణ

telangana

ETV Bharat / sitara

హాలీవుడ్​ సాంకేతికతో 'సలార్'.. తొలి భారతీయ చిత్రంగా! - ప్రభాస్ మూవీ న్యూస్

హాలీవుడ్​ సినిమాల చిత్రీకరణకు ఉపయోగించే కొత్త సాంకేతికతను పాన్​ ఇండియా చిత్రం 'సలార్'కు(Salaar Technologies) ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ టెక్నాలజీ ఉపయోగిస్తున్న మొదటి భారతీయ చిత్రం 'సలార్'(Salaar Movie News) కావడం విశేషం.

salar
సలార్

By

Published : Sep 26, 2021, 5:31 AM IST

రెబల్​ స్టార్​ ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రం 'సలార్'(Salaar Technologies). 'కేజీఎఫ్​' చిత్రంతో దర్శకుడిగా మంచి పేరు సంపాదించిన ప్రశాంత్ నీల్ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. వీరిద్దరి కాంబోలో వస్తున్న ఈ మూవీపై అభిమానులకు ఆసక్తి పెరుగుతోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది .

ఈ సినిమా కోసం హాలీవుడ్​లో ఉపయోగించే 'డార్క్ సెంట్రిక్ థీమ్'ను(Dark Centric Theme Technology Movies) ఉపయోగిస్తున్నట్లు తెలిసింది. బ్యాట్​మన్ ఫిల్మ్ సిరీస్, టెనెట్, మ్యాట్రిక్స్ మొదలైన చిత్రాలకు ఈ సాంకేతికతను ఉపయోగించారు.

భారీ బడ్జెట్​తో రూపొందుతున్న ఈ చిత్రంలో శ్రుతిహాసన్ హీరోయిన్​గా నటిస్తోంది. ఇప్పటికే 50 శాతానికి పైగా చిత్రీకరణ పూర్తయినట్లు సమాచారం. వచ్చే ఏడాది ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

ABOUT THE AUTHOR

...view details