తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'సఖియే.. నీ జాడ వెతికి నా చూపులు అలసినవే' - ఆకాశం నీ హద్దురా సఖియే సాంగ్

సూర్య, అపర్ణ బాలమురళి ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ చిత్రం 'సూరారై పొట్రు'. తెలుగులో 'ఆకాశం నీ హద్దురా' పేరుతో విడుదలవనుంది. దీపావళి కానుకగా నవంబర్ 12న అమెజాన్ ప్రైమ్ వేదికగా ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్​లో భాగంగా చిత్రంలోని 'సఖియే' అనే పాటను విడుదల చేసింది చిత్రబృందం.

Sakhiyae song released from Akaasam Nee Haddhu Ra
సూర్య

By

Published : Nov 6, 2020, 7:55 PM IST

ప్రేమ రాగాలే కాదు విరహ గీతాలు, భావోద్వేగ స్వరాలూ శ్రోతల మనసుల్లో ముద్ర వేసుకుంటాయి. ఇలాంటి వాటిల్లో సాహిత్యం ప్రధాన పాత్ర పోషిస్తుంది. ప్రతి ఒక్కరి జీవితంలోకి చొచ్చుకుపోతుంది. రామజోగయ్య శాస్త్రి రచించిన 'సఖియే' పాట తాజాగా ఈ జాబితాలోకి చేరింది. 'ఆకాశం నీ హద్దురా' సినిమా కోసం ఆయన రాసిన గీతమిది. సామాజిక మాధ్యమాల వేదికగా నవంబరు 6న(నేడు) విడుదల చేసింది చిత్రబృం‍దం.

సూర్య, అపర్ణ బాలమురళి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన తమిళ చిత్రం 'సూరారై పొట్రు'. మోహన్‌ బాబు ముఖ్య భూమిక పోషించారు. తెలుగులో 'ఆకాశం నీ హద్దురా' పేరుతో విడుదల కాబోతుంది. దక్కన్‌ ఎయిర్‌వేస్‌ అధినేత గోపీనాథ్ జీవితాధారంగా రూపొందింది. కోపంలో కథానాయకుడు.. నాయికని ద్వేషించి, ఆమెపై చేయిచేసుకున్న సందర్భంలో వచ్చే పాటలా అనిపిస్తుంది సాహిత్యాన్ని బట్టి చూస్తుంటే. ఇందులోని భావోద్వేగం అందరిని కదిలించేలా ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితంలో ఇలాంటి సందర్భం వచ్చే ఉంటుంది. జీవీ ప్రకాశ్‌ కుమార్‌ స్వరాలు సమకూర్చగా.. యదు కృష్ణ కె చక్కగా ఆలపించారు. దీపావళి కానుకగా అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో నవంబరు 12న ప్రేక్షకుల ముందుకు రాబోతుందీ చిత్రం.

ABOUT THE AUTHOR

...view details