ఓ సినిమా విజయం సాధిస్తే దానికి సీక్వెల్ చేయడం ఓ పద్ధతి. ఆ చిత్ర పేరునే కొనసాగిస్తూ మరో కొత్త కథను తీసుకురావడం మరో పద్ధతి. ఇప్పుడీ రెండో పద్ధతిలోనే సాయిరాం శంకర్ హీరోగా 'బంపర్ ఆఫర్ 2' చిత్రానికి రంగం సిద్ధమైంది. జయ రవీంద్ర దర్శకుడు. సురేష్ యల్లంరాజు, సాయిరామ్ శంకర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాను శనివారం అధికారికంగా ప్రకటించారు.
12 ఏళ్ల తర్వాత రెండో 'బంపర్ ఆఫర్'తో - movie news
పూరీ జగన్నాథ్ సోదరుడు సాయిరామ్ శంకర్ హీరోగా కొత్త చిత్రం ఖరారైంది. 12 ఏళ్ల క్రితం వచ్చిన 'బంపర్ ఆఫర్'కు కొనసాగింపుగా దీనిని తెరకెక్కించనున్నారు.
12 ఏళ్ల తర్వాత రెండో 'బంపర్ ఆఫర్'తో
"బంపర్ ఆఫర్ విజయం నేపథ్యంలో 12 ఏళ్ల తర్వాత అదే పేరుతో రెండో భాగం తీసుకొస్తున్నాం. ఇది సీక్వెల్ కాదు. రాయలసీమ నేపథ్యంలో పూర్తి కమర్షియల్ ఎంటర్టైనర్గా రూపొందించనున్నాం. ఉగాది సందర్భంగా ఏప్రిల్లో రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభిస్తాం. ఇందులోని ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాల్ని త్వరలో ప్రకటిస్తాం" అని నిర్మాత సురేశ్ తెలిపారు.