హైబ్రిడ్ పిల్ల అంటే మరో ఆలోచన లేకుండా గుర్తొచ్చే పేరు సాయిపల్లవి. 'ఫిదా'తో తెలుగు ప్రేక్షకుల్ని ఫిదా చేసింది ఈ ముద్దుగుమ్మ. అంతకుముందే 'ప్రేమమ్'లో తన హావాభావాలతో కట్టిపడేసింది. శర్వానంద్ హీరోగా 'పడిపడి లేచే మనసు'తో కుర్రకారు మనసు దోచేసిన నటి సాయి పల్లవి. నేడు ఆమె పుట్టినరోజు.
తమిళనాడులోని కోయంబత్తూరులో జన్మించింది సాయి పల్లవి. 2009లో ఈటీవీలో వచ్చిన ఢీ4లో తన డ్యాన్స్‌తో అందరినీ మెప్పించింది. మలయాళంలో వచ్చిన 'ప్రేమమ్' సినిమాలో 'మలర్' పాత్ర మంచి గుర్తింపు తెచ్చింది. తెలుగులో 2017లో శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన 'ఫిదా' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. ఈ మూవీలో తెలంగాణ యాస మాట్లాడుతూ తన హావభావాలతో ఆకట్టుకుంది.