ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ జీవిత కథ ఆధారంగా అమోల్ గుప్త దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'సైనా'. పరిణీతి చోప్రా టైటిల్ రోల్ పోషించింది. మార్చి 26న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ తెచ్చుకుంది. ముఖ్యంగా సైనా పాత్ర కోసం పరిణీతి పడిన కష్టం ప్రతి సన్నివేశంలోనూ ప్రతిబింబించింది.
ఓటీటీ విడుదలకు సిద్ధమైన 'సైనా' - సైనా ఓటీటీ రిలీజ్
బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ జీవితకథ ఆధారంగా రూపొందిన చిత్రం 'సైనా'. పరిణీతి చోప్రా టైటిల్ పాత్ర పోషించింది. ఇటీవలే థియేటర్లలో సందడి చేసిన ఈ సినిమా త్వరలోనే అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులోకి రానుంది.

ఓటీటీ విడుదలకు సిద్ధమైన 'సైనా'
అయితే, త్వరలోనే ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వేదికగా నెటిజన్లను అలరించేందుకు సిద్ధమవుతోంది. ఏప్రిల్ 23వ తేదీ నుంచి 'సైనా'ను అమెజాన్ ప్రైమ్ వేదికగా అందుబాటులోకి తీసుకురానున్నారు. ప్రపంచవ్యాప్తంగా అభిమానులందరికీ 'సైనా' అందుబాటులోకి వస్తుండటంపై పరిణీతి సంతోషం వ్యక్తం చేశారు. తన కెరీర్‌లో మైలు రాయిలాంటి చిత్రమని ఆమె అన్నారు.
ఇదీ చూడండి:పశువైద్యుడి కథతో అజయ్ దేవగణ్ 'గోబర్'