తెలంగాణ

telangana

ETV Bharat / sitara

డార్లింగ్ ప్రభాస్ 'ఆదిపురుష్'లో సైఫ్?

స్టార్ హీరో ప్రభాస్ 'ఆదిపురుష్' సినిమాలో సైఫ్ అలీఖాన్ ప్రతినాయకుడిగా కనిపించనున్నారట. ఈ విషయమై జోరుగా చర్చ జరుగుతోంది.

డార్లింగ్ ప్రభాస్ 'ఆదిఫురుష్'లో సైఫ్?
ప్రభాస్-సైఫ్ అలీఖాన్

By

Published : Aug 19, 2020, 9:19 PM IST

డార్లింగ్ ప్రభాస్ కొత్త సినిమా 'ఆదిపురుష్'. భారతీయ ఇతిహాస కథతో దీనిని రూపొందించనున్నారు. వచ్చే ఏడాది నుంచి షూటింగ్ ప్రారంభం కానుంది. ఫస్ట్​లుక్​తో పాటు ప్రకటన వచ్చిన వెంటనే ఇందులో బాలీవుడ్​ ప్రముఖ నటుడు కీలక పాత్రలో కనిపించనున్నారనే వార్త ఆసక్తి రేపింది. అతడు సైఫ్ అలీఖాన్ అని టాక్.

చెడుపై మంచిదే విజయం అనే కథతో దర్శకుడు ఓం రౌత్ ఈ సినిమా తీస్తున్నారు. ఇందులో ప్రభాస్​కు ధీటుగా ప్రతినాయకుడి పాత్ర ఉండనుందట. దానికోసమే సైఫ్​ను సంప్రదించినట్లు సమాచారం. ఈ నటుడు ఓం రౌత్​ చివరి సినిమా 'తాన్హాజీ'లో కీలక పాత్రలో కనిపించాడు. అందుకే ఈ ఊహాగానాలు ఎక్కువగా వస్తున్నాయి.

ఆదిపురుష్ పోస్టర్

ఈ సినిమాను నేరుగా తెలుగు, హిందీలో తెరకెక్కించి ఆపై తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో డబ్ చేయనున్నారు. భూషణ్‌ కుమార్‌ సమర్పణలో గుల్షన్‌ కుమార్‌, టీ-సిరీస్‌ పతాకంపై కిషన్‌ కుమార్‌, ఓం రౌత్‌, ప్రసాద్‌ సుతార్‌ రాజేష్‌ నాయర్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 2022లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details