తన కుమార్తె, నటి సారా అలీఖాన్‌ను స్ర్కీన్‌పై చూడడం ఎంతో సరదాగా ఉందని స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ అన్నారు. వరుణ్‌ధావన్, సారా అలీఖాన్ జంటగా నటించిన 'కూలీ నం.1' అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌కు మిశ్రమ స్పందనలు లభిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా నటుడు సైఫ్.. సారా అలీఖాన్‌ను ఆన్‌స్ర్కీన్‌పై చూడడం గురించి స్పందించారు.
" ప్రస్తుతానికి నేనింకా 'కూలీ నం.1' ట్రైలర్ చూడలేదు. కానీ ఈ సినిమాకు సంబంధించిన కొన్ని వీడియో సాంగ్స్‌ను సారా నాకు ప్రత్యేకంగా చూపించింది. సారా.. తన పాత్రను పూర్తిగా ఎంజాయ్ చేస్తూ నటించిందని ఆ వీడియోలు చూస్తే అర్థమైంది. స్ర్కీన్‌పై సారాని చూడడం ఎంతో సరదాగా అనిపించింది. ఎందుకంటే తను నా కళ్లకు ఇప్పటికీ ఓ చిన్నపిల్లలా కనిపిస్తుంది" అని సైఫ్ అలీఖాన్ అన్నాడు.