తెలంగాణ

telangana

ETV Bharat / sitara

నేను అలాంటి బాధను ఎదుర్కొన్నవాడినే: సైఫ్ అలీఖాన్ - సైఫ్ అలీఖాన్ వార్తలు

బాలీవుడ్​లో గతంలో తాను సవాళ్లు ఎదుర్కొన్నానని చెప్పిన సైఫ్ అలీఖాన్.. సుశాంత్ సింగ్ మరణం గురించి మాట్లాడారు. అతడు అకస్మాత్తుగా చనిపోవడం బాధ కలిగించిందని చెప్పుకొచ్చారు.

నేను అలాంటి బాధను ఎదుర్కొన్నవాడినే: సైఫ్ అలీఖాన్
సైఫ్ అలీఖాన్

By

Published : Jul 1, 2020, 6:11 PM IST

బాలీవుడ్​లో వారసత్వ నటీనటులు, స్వశక్తితో ఎదిగిన వారు చాలామంది ఉన్నారని, వారందరిని ఒకేలా చూడటం కష్టమని అంటున్నారు ప్రముఖ నటుడు సైఫ్ అలీ ఖాన్. ఎవరికి వారు తమదైన ప్రతిభతో రాణిస్తున్నారని చెప్పారు. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రస్తుత హిందీ చిత్రసీమలోని పరిస్థితులు, సుశాంత్ సింగ్ ఆత్మహత్య, తమ కుమారుడు తైమూర్ అలీఖాన్ గురించిన పలు విషయాల్ని పంచుకున్నారు.

"ఈ లాక్‌డౌన్‌ సమయం నాకెంతో నేర్పింది. ముఖ్యంగా మా అబ్బాయి తైమూర్‌తో కలిసి ఆడుకోవడం కొత్తగా ఉంది. ఇప్పటివరకు వాడితో ఎప్పుడూ ఇంత సమయాన్ని గడపలేదు. సుశాంత్‌ చాలామంచి భవిష్యత్తు ఉన్న నటుడు. ఆత్మహత్య చేసుకోవడం నాకు చాలా బాధేసింది. ఖగోళ శాస్త్రం నుంచి తత్వశాస్త్రం వరకు అనేక అంశాలు అతడికి చాలా బాగా తెలుసు. చిత్రసీమలో బంధుప్రీతి, అభిమానం, వివిధ గ్రూపులు అనేక విషయాలు ఉంటాయి. ఇప్పుడవన్నీ అనవసరం. నేనూ గతంలో ఇలాంటి బాధను ఎదుర్కొన్నవాడినే. భవిష్యత్తులో అంతా మంచే జరుగుతుందని ఆశిద్దాం" -సైఫ్ అలీ ఖాన్, బాలీవుడ్ హీరో

సుశాంత్ సింగ్, సంజనా సంఘీ నటించిన 'దిల్​బెచారా' సినిమాలో సైఫ్ అతిథి పాత్ర పోషించారు. జులై 24 నుంచి హాట్​స్టార్​లో స్ట్రీమింగ్ కానుంది. ఈ ఏడాది 'తాన్హాజీ', 'జవానీ జానేమన్​' చిత్రాలతో ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు వచ్చారు సైఫ్.

ABOUT THE AUTHOR

...view details