తెలంగాణ

telangana

ETV Bharat / sitara

అల్లు అర్జున్​-కొరటాల సినిమాలో బాలీవుడ్​ బ్యూటీ! - అల్లు అర్జున్​ కొరటాల శివ

కొరటాల శివ దర్శకత్వంలో అల్లు అర్జున్​ హీరోగా ఓ సినిమా రూపొందనుంది. ఈ చిత్రంలో హీరోయిన్​గా బాలీవుడ్ నటి సయీ మంజ్రేకర్​ను ఎంపిక చేసినట్లు సమాచారం.

Saiee Manjrekar to romance Allu Arjun in Koratala Siva's directorial?
అల్లు అర్జున్​-కొరటాల సినిమాలో బాలీవుడ్​ బ్యూటీ!

By

Published : Jan 15, 2021, 6:54 AM IST

స్టైలిష్​స్టార్​ అల్లుఅర్జున్​, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్​లో ఓ సినిమా రూపొందనుంది. వేసవిలో షూటింగ్​ ప్రారంభం కానుందని సమాచారం. ప్రస్తుతం స్క్రిప్ట్​ వర్క్​ జరుగుతోంది. యువసుధ ఆర్ట్స్, జీఏ2 బ్యానర్​పై ఈ చిత్రం నిర్మాణం కానుంది. 2022 ప్రారంభంలో సినిమా విడుదల చేయాలని భావిస్తున్నారు.

అయితే ఇందులో బన్ని సరసన హీరోయిన్​గా బాలీవుడ్​ బ్యూటీ సయీ మంజ్రేకర్​ను చిత్రబృందం సంప్రదించినట్లు టాలీవుడ్​ వర్గాలు అంటున్నాయి. ఇప్పటికే తెలుగులో రెండు చిత్రాల్లోనూ (వరుణ్​ తేజ్​ బాక్సింగ్​ నేపథ్యంతో తెరకెక్కుతోన్న సినిమాతో పాటు అడవి శేష్​ 'మేజర్​') చిత్రంలో ఎంపికైంది.

సయీ మంజ్రేకర్​

అల్లు అర్జున్ ప్రస్తుతం 'పుష్ప' చిత్రంతో బిజీగా ఉన్నాడు. అలాగే వేణు శ్రీరామ్ దర్శకత్వంలో 'ఐకాన్' అనే చిత్రానికి ఒప్పుకున్నాడు. కానీ ఇప్పుడు కొరటాల సినిమాతో ఈ చిత్రంపై అనుమానాలు నెలకొన్నాయి. 'ఐకాన్'.. బన్నీ 21వ చిత్రంగా తెరకెక్కాల్సి ఉంది. ఇప్పుడు మరి కొరటాలతో చిత్రం తర్వాత అయినా ఈ సినిమా పట్టాలెక్కుతుందేమో చూడాలి.

ఇదీ చూడండి:అజయ్​తో పెళ్లి.. నాన్న ఒప్పుకోలేదు: కాజోల్

ABOUT THE AUTHOR

...view details