తెలంగాణ

telangana

ETV Bharat / sitara

సాయి ధరమ్​ తేజ్ దీపావళి ప్లాన్స్ ఏంటంటే! - sai dharam tej with alluaravind family on deepavali

మెగా మేనల్లుడు సాయి ధరమ్​ తేజ్​, రాశీ ఖన్నా జంటగా నటిస్తోన్న చిత్రం 'ప్రతిరోజూ పండగే'. ఈ సినిమా ప్రమోషన్స్​లో భాగంగా ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు తేజ్, దర్శకుడు మారుతి.

సాయి తేజ్ దీపావళి ప్లాన్స్ ఇవే..?

By

Published : Oct 27, 2019, 5:41 AM IST

'చిత్రలహరి'తో మంచి విజయం అందుకున్న సుప్రీం హీరో సాయి ధరమ్​ తేజ్ కథానాయకుడిగా నటిస్తోన్న సినిమా 'ప్రతి రోజూ పండగే'. మారుతి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం ప్రమోషన్స్​లో భాగంగా తేజ్, మారుతి ఓ ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. మెగా మేనల్లుడు తన చిన్ననాటి దీపావళి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నాడు.

"చిన్నప్పటి నుంచి ప్రతి సంవత్సరం దీపావళి పండగను అల్లు అరవింద్​ కుటుంబంతో కలిసి చేసుకుంటా. అనంతరం ప్రియ మిత్రులతో, నటుడు నవీన్​​ కృష్ణతో కలిసి ఎంతో ఆనందంగా గడుపుతా."

-సాయి ధరమ్​ తేజ్, టాలీవుడ్​ హీరో.

ఈ సినిమాకు తమన్‌ సంగీతం అందిస్తున్నాడు. అందం అభినయంతో మెప్పిస్తున్న గ్లామర్ డాల్ రాశి ఖన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. యువీ క్రియేషన్స్‌, గీతా ఆర్ట్స్‌ 2 పతాకంపై బన్నీవాసు నిర్మిస్తున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.


ఇదీ చూడండి : ఎన్​కౌంటర్ చేస్తానంటున్న 'రజనీ'

ABOUT THE AUTHOR

...view details