సంక్రాంతికి కంటే ముందే పండుగ చేసుకోబోతున్నాడు మెగాహీరో సాయిధరమ్ తేజ్. ఈ కథానాయకుడు నటిస్తున్న 'ప్రతిరోజూ పండగే' సినిమా విడుదల తేదీని ప్రకటించారు నిర్మాతలు. డిసెంబరు 20న ప్రేక్షకుల ముందుకు తెస్తున్నట్లు వెల్లడించారు.
మెగాహీరో పండుగ మొదలయ్యేది ఆ రోజే..! - glimpse of prathi roju pandage
హీరో సాయిధరమ్ తేజ్ నటిస్తున్న 'ప్రతిరోజూ పండగే' సినిమాను డిసెంబరు 20న విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు.
సాయిధరమ్ తేజ్-రాశీ ఖన్నా
ఈ సినిమాలో రాశీఖన్నా హీరోయిన్గా నటిస్తోంది. సత్యరాజ్, రావు రమేశ్ సహాయ పాత్రల్లో కనిపించనున్నారు. తమన్ సంగీతమందిస్తున్నాడు. కుటుంబ కథతో రూపొందిన ఈ చిత్రానికి మారుతి దర్శకత్వం వహిస్తున్నాడు. అల్లు అరవింద్ సమర్పణలో యూవీ క్రియేషన్స్, జీఏ2 పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
ఇది చదవండి: మన సినిమాలూ హాలీవుడ్లో డబ్ కావాలి: హీరో విజయ్ దేవరకొండ