'చిత్రలహరి', 'ప్రతి రోజు పండగే' విజయాల ఉత్సాహంతో సాయిధరమ్ తేజ్ వరుస సినిమాలు చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే 'సోలో బ్రతుకే సో బెటర్'ను విడుదల వరకు తెచ్చేశాడు. ఈ వేసవిలోనే థియేటర్లలో సందడి చేద్దాం అనుకున్నాడు. కరోనా కారణంగా సినిమా విడుదల వాయిదా పడింది. ఈ ఖాళీ సమయంలో సాయితేజ్ కొత్త కథలు వింటున్నాడని తెలుస్తోంది. సీనియర్ దర్శకులు, హిట్ కొట్టిన దర్శకులనే నియమం పెట్టుకోకుండా... కొత్త వాళ్లతో సినిమాలు చేయాలని అనుకుంటున్నాడట.
'భగవద్గీత సాక్షిగా' అంటోన్న సాయితేజ్! - సాయి ధరమ్ తేజ వార్తలు
మెగామేనల్లుడు సాయిధరమ్ తేజ్ వరుస చిత్రాలు ఓకే చేస్తూ జోరు చూపిస్తున్నాడు. తాజాగా ఈ హీరో మరో కొత్త దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
ఈ క్రమంలో ఇటీవల సాయిధరమ్ తేజ్ ఓ కొత్త కుర్రాడి కథ విన్నాడని తెలుస్తోంది. 'భగవద్గీత సాక్షిగా' అనే స్క్రిప్టు విన్నాడట. కథ, కాన్సెప్ట్ కొత్తగా ఉండడం వల్ల సినిమా చేయడానికి తేజు సిద్ధమయ్యాడట. దీంతోపాటు ఈ కథను చిరంజీవికి వినిపించారని భోగట్టా. సినిమా క్లైమాక్స్ విషయంలో చిరు కొన్ని సూచనలు చేశారని టాలీవుడ్ టాక్. ఆ మార్పులు, చేర్పులు చేసి మెగాస్టార్‌తో ఓకే చేయించుకుంటే తేజుకు మరో సినిమా ముడిసరుకు సిద్ధమైనట్లే.
సాయితేజ్ 'సోలో బ్రతుకే సో బెటర్' తరువాత దేవా కట్టా దర్శకత్వంలో ఓ సినిమా చేయాల్సి ఉంది. ఇది తేజ్ కెరీర్‌లోనే భారీ బడ్జెట్ సినిమా అని అనుకుంటున్నారు. 'సోలో బ్రతుకే..' సినిమా నుంచి లాక్‌డౌన్ టైమ్‌లో 'నో పెళ్లి...' అనే పాట విడుదలై ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. దీనికి యూట్యూబ్‌లో మంచి స్పందనే వచ్చింది.