తెలంగాణ

telangana

ETV Bharat / sitara

సాయిధరమ్​తేజ్​తో రాశిఖ‌న్నా సెల్ఫీ చూశారా? - pratiroju pandage

సాయితేజ్​, రాశీఖన్నా హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం 'ప్రతిరోజు పండగే'. ఈ సినిమా సెట్​లో వీరిద్దరూ తీసుకున్న సెల్ఫీని రాశీఖన్నా ట్వీట్ చేసింది.

సాయి

By

Published : Jul 24, 2019, 10:16 AM IST

'చిత్రలహరి' సినిమాతో మంచి విజయం అందుకొన్న సుప్రీం హీరో సాయి ధరమ్​ తేజ్ హీరోగా నటిస్తోన్న చిత్రం 'ప్రతిరోజు పండగే'. ఈ మూవీకి 'భలే భలే మగాడివోయ్', 'మహానుభావుడు' వంటి బంపర్ హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన మారుతి దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్ నిర్మాతగా వ్యవహరిస్తోన్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది.

ఈ చిత్రంలో సాయితేజ్‌, రాశీఖ‌న్నా జంట‌గా న‌టిస్తున్నారు. వీరిద్ద‌రూ ఇంత‌కు ముందు 'సుప్రీమ్' లాంటి ఎంట‌ర్‌టైనింగ్ ఫిల్మ్​లో చేశారు. తాజాగా సుప్రీమ్ హీరో సాయితేజ్‌, రాశీఖ‌న్నాలు క‌లిసి ఉన్న సెల్ఫీ పిక్​ని హీరోయిన్ రాశీఖ‌న్నా ట్వీట్ చేసింది.

ప్ర‌స్తుతం హైద‌రాబాద్ ప‌రిస‌ర ప్రాంతాల్లో షూటింగ్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటోందీ సినిమా. త్వ‌ర‌లో రాజ‌మండ్రి ప‌రిస‌ర ప్రాంతాల్లో షూటింగ్ కోసం సిద్ధమవుతోంది.

సాయి తేజ్​, రాఖీ ఖన్నా సెల్ఫీ

ఇవీ చూడండి.. మహేష్​ సినిమాలో 'ఖడ్గం' నటి..!

ABOUT THE AUTHOR

...view details