కథానాయకుడు సాయి తేజ్ ఓటీటీ వైపు అడుగులేస్తున్నారు. ఆయన నుంచి రాబోతున్న కొత్త చిత్రం 'సోలో బ్రతుకే సో బెటర్'.. ఓ ప్రముఖ ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని సమాచారం. నూతన దర్శకుడు సుబ్బు తెరకెక్కిస్తున్న చిత్రమిది. బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మాత. నభా నటేష్ కథానాయికగా నటిస్తోంది.
ఓటీటీలో 'సోలో బ్రతుకే సో బెటర్'! - సాయి ధరమ్ తేజ్ వార్తలు
టాలీవుడ్ యువకథానాయకుడు సాయితేజ్ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం 'సోలో బ్రతుకే సో బెటర్'. ఈ సినిమాను ఓ ప్రముఖ ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారని సమాచారం.
![ఓటీటీలో 'సోలో బ్రతుకే సో బెటర్'! Sai Tej's Solo Brathuke so better movie is getting ready for OTT release!](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8954316-984-8954316-1601175208427.jpg)
ఓటీటీలో విడుదలకు సిద్ధమైన 'సోలో బ్రతుకే సో బెటర్'!
ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. శరవేగంగా నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకొంటోంది. ఇప్పుడీ చిత్రాన్ని ఓటీటీ ద్వారా విడుదల చేసేందుకు చిత్రబృందం సమాయత్తమవుతోంది. ఇప్పటికే ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ చిత్రబృందంతో ఒప్పందం కుదుర్చుకుందని సమాచారం. పే ఫర్ వ్యూ పద్ధతిలో సినిమాను చూపించేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశాలున్నాయి. ఈ చిత్రానికి సంగీతం: తమన్, కూర్పు: నవీన్ నూలి, ఛాయాగ్రహణం: వెంకట్ సి దిలీప్.