టాలీవుడ్ హీరో సాయిధరమ్ తేజ్ నటిస్తున్న చిత్రం 'సోలో బ్రతుకే సో బెటర్'. ఈ సినిమాను ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి ఓ ప్రముఖ ఓటీటీతో నిర్మాణ సంస్థ ఇటీవల చర్చలు జరిపిందని సమాచారం. అక్టోబరులో సినిమాను రిలీజ్ చేయడానికి రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది.
'సోలో'గా ఓటీటీలో విడుదలకు సిద్ధమైన సాయితేజ్! - సోలో బ్రతుకే సో బెటర్ లేటెస్ట్ న్యూస్
మెగాహీరో సాయి తేజ్ నటిస్తున్న చిత్రం 'సోలో బ్రతుకే సో బెటర్' త్వరలో ఆన్లైన్ వేదికగా విడుదల కానుందని సమాచారం. ఈ చిత్రబృందం ఇటీవల ఓ ప్రముఖ ఓటీటీ సంస్థతో చర్చలు జరిపినట్లు టాలీవుడ్ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
!['సోలో'గా ఓటీటీలో విడుదలకు సిద్ధమైన సాయితేజ్! Sai Tej's next for OTT release-To come out during this time](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8406277-114-8406277-1597329008550.jpg)
'సోలో'గా ఓటీటీలో విడుదలకు సిద్ధమైన సాయితేజ్!
ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ తుదిదశకు చేరుకుంది. మిగిలిన సన్నివేశాల్ని వీలైనంత త్వరగా పూర్తి చేసి రిలీజ్కు సిద్ధం చేయనున్నారని తెలుస్తోంది. ఈ చిత్రం రొమాంటిక్ కామెడీ కథాంశంతో తెరకెక్కుతోంది. రావు రమేశ్ ఓ కీలకపాత్రలో కనిపించనున్నారు. సుబ్బు అనే నూతన దర్శకుడు పరిశ్రమకు పరిచయమవుతున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను చిత్రబృందం త్వరలోనే వెల్లడించనుంది.