మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్... ఒక్కో జోనర్ ప్రేక్షకుల కోసం విభిన్న కథలు ఎంచుకుని ఆకట్టుకుంటున్నాడు. ఇటీవల 'ప్రతిరోజూ పండగే'తో అందర్ని అలరించాడు. ప్రస్తుతం తేజ్ హీరోగా తెరకెక్కుతోన్న 'సోలో బ్రతుకే సో బెటర్' సినిమాలో థీమ్ వీడియోను గురువారం విడుదల చేసింది చిత్రబృందం. ఇందులో సాయితేజ్ యువతలో ప్రేరణ కలిగేలా మాట్లాడుతూ కనిపించాడు.
సాయితేజ్ నినాదం.. 'సోలో బ్రతుకే సో బెటర్' - సోలో బ్రతుకే సో బెటర్ థీమ్ సాంగ్
సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్.. యువతను ఆకర్షించేలా సినిమాలు చేస్తూ ట్రెండ్‌కు తగ్గట్టు పాత్రలు ఎంచుకొని కలెక్షన్లు కొల్లగొడుతున్నాడు. 'చిత్రలహరి' వంటి ప్రేమకథా చిత్రంతో పాటు 'ప్రతిరోజూ పండగే' అంటూ వచ్చి మంచి క్రేజ్ దక్కించుకున్నాడు. తాజాగా 'సోలో బ్రతుకే సో బెటర్' అనే నినాదంతో ఆకట్టుకుంటున్నాడీ హీరో.
'సోలో బ్రతుకే సో బెటర్'.. సాయితేజ్ నినాదం!
ఈ చిత్రానికి సుబ్బు దర్శకత్వం వహిస్తున్నాడు. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాత. తేజ్ సరసన నభా నటేశ్ కనిపించనుంది. తమన్ సంగీతం అందిస్తున్నాడు. మే 1న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇదీ చదవండి:పాన్ ఇండియా సినిమాతో మనోజ్ రీఎంట్రీ
Last Updated : Mar 1, 2020, 6:00 AM IST