తెలంగాణ

telangana

ETV Bharat / sitara

సాయిపల్లవికి ఇంట్లో నుంచే పోటీ మొదలైందా? - సాయిపల్లవి సోదరి

స్టార్​ హీరోయిన్ సాయిపల్లవి సోదరి పూజా కన్నన్​కు ఓ తమిళ సినిమాలో కథానాయికగా అవకాశం వచ్చిందని సమాచారం. స్టంట్​ మాస్టర్​ శివ దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమాలో పూజ హీరోయిన్​గా ఎంపికయ్యారని కోలీవుడ్​లో ప్రచారం జరుగుతోంది.

Sai Pallavi's sister Pooja making her acting debut in Stunt Silva's film?
సాయిపల్లవికి ఇంట్లో నుంచే పోటీ మొదలైందా?

By

Published : Mar 17, 2021, 1:46 PM IST

కథానాయిక సాయిపల్లవికి.. తన ఇంటి నుంచే పోటీ మొదలవుతున్నట్లు తెలుస్తోంది. సాయిపల్లవికి పోటీ మరెవరో కాదు ఆమె సోదరి పూజా కన్నన్‌. డ్యాన్స్‌తో పాటు చలాకీతనంలోనూ అక్కతో పోటీపడే పూజా.. తరచూ తన ఫొటోలు, వీడియోలను సోషల్‌మీడియాలో షేర్‌ చేస్తుంటుంది.

పూజ.. అందం, అభినయానికి ఫిదా అయిన ప్రముఖ స్టంట్‌ మాస్టర్‌ శివ.. తాను దర్శకత్వం వహించనున్న మొదటి సినిమాలో ఆమెకు అవకాశం ఇచ్చినట్లు సమాచారం. శివ చెప్పిన కథ నచ్చడం వల్ల కథానాయికగా తెరంగేట్రం చేసేందుకు పూజా కూడా గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే సాయిపల్లవికి ఇంటి నుంచి పోటీ మొదలైందని కోలీవుడ్‌లో అందరూ చెప్పుకుంటున్నారు.

పూజా కన్నన్​, సాయిపల్లవి

సాయిపల్లవి.. ప్రస్తుతం ఆమె 'విరాటపర్వం', 'లవ్‌స్టోరీ' సినిమాలతో బిజీగా ఉన్నారు. నాగచైతన్య కథానాయకుడిగా నటిస్తున్న 'లవ్‌స్టోరీ'కి శేఖర్‌ కమ్ముల దర్శకత్వం వహించారు. వేసవి కానుకగా ఏప్రిల్‌ 16న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు విప్లవ కథాంశంతో రూపుదిద్దుకుంటోన్న 'విరాటపర్వం' ఏప్రిల్‌ 30న విడుదల కానుంది. రానా ప్రధానపాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి వేణు ఉడుగుల దర్శకుడు. ఇవే కాకుండా 'వేదాళం' రీమేక్‌తోపాటు 'అయ్యప్పనుమ్ కోషియం' రీమేక్‌లోనూ సాయిపల్లవి కీలకపాత్రలో కనిపించనున్నట్లు సమాచారం.

పూజా కన్నన్​, సాయిపల్లవి

ఇదీ చూడండి:ప్రభాస్​ సరసన 'కేజీఎఫ్​' బ్యూటీ!

ABOUT THE AUTHOR

...view details