తెలంగాణ

telangana

ETV Bharat / sitara

శేఖర్​ కమ్ముల- ధనుష్​ సినిమాలో సాయి పల్లవి! - movie talks

శేఖర్​ కమ్ముల దర్శకత్వంలో ధనుష్​ కథనాయకుడిగా ఓ పాన్​ ఇండియా సినిమా త్వరలో పట్టాలెక్కనుంది. ఈ మూవీలో సాయి పల్లవిని కథానాయికగా ఎంపిక చేశారని సమాచారం.

Sai Pallavi
సాయిపల్లవి

By

Published : Jun 19, 2021, 8:42 PM IST

Updated : Jun 19, 2021, 10:21 PM IST

సరికొత్త ప్రేమకథ చిత్రాలను తెరపైకి తీసుకొచ్చే డైరెక్టర్ శేఖర్​ కమ్ముల(Sekhar Kammula). విలక్షణమైన పాత్రలతో ప్రేక్షకులను అలరించే నటుడు ధనుష్​(Dhanush). ప్రస్తుతం వీరిద్దరి కాంబినేషన్​లో ఓ పాన్​ ఇండియా సినిమా తెరకెక్కనుంది. ఇందులో ధనుష్​ జంటగా సాయి పల్లవిని ప్రధాన కథనాయికగా ఎంచుకున్నట్లు సమాచారం.

శేఖర్​ కమ్ముల ఫేవరెట్​ కథానాయిక​ సాయి పల్లవి. ఇప్పటికే రెండు సినిమాల్లో ఈ ముద్దు గుమ్మతో కలిసి పనిచేశారు. అటు ధనుష్​తో ఇప్పటికే మారీ-2 చేసింది సాయి పల్లవి. అందులోని 'రౌడీ బేబీ' పాట.. యూట్యూబ్​లో ఎన్నో రికార్డులను బద్దలుకొట్టింది. మరి శేఖర్​ కమ్ముల(sekhar kammula dhanush movie) సినిమాలో సాయి పల్లవి ఉంటుందా? లేదా? అన్న ప్రశ్నకు సమాధానం కావాలంటే.. అధికారిక ప్రకటన కోసం వేచిచూడాల్సిందే.

Last Updated : Jun 19, 2021, 10:21 PM IST

ABOUT THE AUTHOR

...view details