నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన 'లవ్‌స్టోరీ'(Lovestory success meet) సినిమా ఇటీవల విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ చిత్రంలోని హీరోహీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ, సాయిపల్లవి డ్యాన్స్‌కు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. అభిమానులను కట్టిపడేసిన సన్నివేశాల్లో చైతూ,పల్లవి(naga chaitanya and sai pallavi movie) ముద్దు సీన్ కూడా ఒకటి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న పల్లవి.. కిస్ సీన్ గురించి మాట్లాడుతూ.. ఇలాంటి సన్నివేశాలకు తాను వ్యతిరేకమని చెప్పింది.
"పాత్ర బాగుంటే పెర్ఫార్మెన్స్ దానంతట అదే ఉత్తమంగా వస్తుంది. నేనెప్పుడు ముద్దు సన్నివేశాల్లో నటించను. వాటికి నేను వ్యతిరేకం. ఆ విషయంలో శేఖర్‌కమ్ముల కూడా ఇబ్బంది పెట్టలేదు. సినిమాలో ఉన్న ఆ సీన్ నిజమైనది కాదు. కెమెరామెన్ దాన్ని నిజం అనిపించేలా తీశారు. ఏవో ఏవో కలలే పాటలోనూ ఏ తాడు సాయం లేకుండానే ఎగిరి సెప్పులేశా. దానికి కావాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకున్నా. కెమెరామెన్ లో యాంగిల్లో తీయడం వల్ల బాగా ఎత్తు ఎగిరినట్టు కనిపించింది."