తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఎగ్జామినేషన్​ హాల్​లో నటి సాయిపల్లవి.. ఎందుకు? - Foreign Medical Graduate Examination

ఫారెన్​ మెడికల్​ గ్రాడ్యుయేట్​ పరీక్ష రాసేందుకు​ కేరళలోని తిరుచ్చి వెళ్లింది నటి సాయి పల్లవి. ఆమెను గుర్తించిన పలువురు అభిమానులు సెల్ఫీల కోసం పోటీ పడ్డారు.

Sai Pallavi steps out to write exam, fans delighted to see her
సాయిపల్లవి

By

Published : Sep 3, 2020, 8:25 AM IST

Updated : Sep 3, 2020, 12:08 PM IST

ప్రముఖ హీరోయిన్ సాయిపల్లవి కేరళలోని తిరుచ్చి ఎమ్​ఏఎమ్​ కళాశాలలోని ఓ పరీక్షకు హాజరైంది. మాస్క్​ పెట్టుకుని వచ్చిన ఆమెను గుర్తుపట్టిన కొందరు అభిమానులు సెల్ఫీల కోసం ఎగబడ్డారు.

జార్జియాలో మెడిసిన్​ చేసిన సాయిపల్లవి.. ఇక్కడ మెడికల్​ ప్రాక్టీస్​ పెట్టడంలో భాగంగా విదేశీ వైద్య ఉన్నతవిద్య పరీక్ష రాసేందుకు వచ్చిందని అభిమానులు అంటున్నారు.

జార్జియాలోని టిబ్లిసీ స్టేట్​ మెడికల్​ యూనివర్సిటీ నుంచి 2016లో వైద్యవిద్యలో పట్టా పొందింది సాయిపల్లవి. డాక్టర్​ కావాలనేది తన కల అని చాలా ఇంటర్వ్యూలలో వెల్లడించింది. ప్రస్తుతం తెలుగులో 'లవ్​స్టోరీ', 'విరాటపర్వం' సినిమాల్లో నటిస్తోంది.

ఇదీ చూడండి: 'ఆదిపురుష్'​లో విలన్​ లంకేష్ ఇతడే

Last Updated : Sep 3, 2020, 12:08 PM IST

ABOUT THE AUTHOR

...view details