సాయిపల్లవి.. మిగతా హీరోయిన్ల కంటే కాస్త భిన్నం. ఫేమ్, గ్లామర్, డబ్బు గురించి ఆలోచించి సినిమాలు చేయదు. కేవలం తనకు నచ్చిన పాత్రలే చేస్తూ గుర్తింపు తెచ్చుకుంది. ఎంతో మంది అభిమానుల్ని సంపాదించుకుంది. కొన్ని రోజుల క్రితం రూ.2 కోట్ల విలువైన డీల్‌ను వద్దనుకొని వార్తల్లో నిలిచింది. ఇప్పుడు మరోసారి అలాంటిదే చేసిందట.
సాయిపల్లవికి ఓ షాపింగ్‌మాల్ ప్రచారం కోసం కోటి రూపాయలు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. అయితే ఈ అమ్మడు ఆ ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించింది. మరోసారి వార్తల్లోకెక్కింది.