తెలంగాణ

telangana

ETV Bharat / sitara

జీవితాంతం సింగిల్​గానే సాయిపల్లవి! - sai pallavi latest news

పెళ్లి విషయమై మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది నటి సాయిపల్లవి. దీనిబట్టి జీవితాంతం సింగిల్​గానే ఉంటానని పరోక్షంగా చెప్పినట్లు తెలుస్తోంది.

జీవితాంతం సింగిల్​గానే సాయిపల్లవి!
Sai Pallavi opens up about her marriage plans

By

Published : Sep 19, 2020, 9:44 PM IST

హీరోయిన్​గా చేస్తూ పలు సినిమాలతో బిజీగా ఉన్న హీరోయిన్ సాయిపల్లవి.. పెళ్లి గురించి మరోసారి మాట్లాడిందట. ఆడపిల్లలు వివాహం తర్వాత కన్న వారిని విడిచిపెట్టి మెట్టినింట అడుగు పెట్టాల్సి వస్తుందని, అందుకే పెళ్లి చేసుకోకుండా అమ్మానాన్నలను బాగా చూసుకుంటే సరిపోతుంది కదా అని చెప్పిందట.

తల్లిదండ్రులపై సాయిపల్లవి ప్రేమను ఇలా తెలియజేసిందని కొందరు అంటుండగా, జీవితం అన్న తర్వాత అన్ని ప్రేమలను రుచి చూడాల్సిందేనని మరికొందరు అంటున్నారు.

ప్రస్తుతం ఈమె తెలుగులో రానాతో కలిసి 'విరాటపర్వం'లో నటిస్తోంది. దర్శకుడు శేఖర్‌ కమ్ముల రొమాంటిక్ ప్రేమకథ 'లవ్‌స్టోరి'లోనూ కథానాయికగా కనిపించనుంది.

ABOUT THE AUTHOR

...view details