పక్కింటి అమ్మాయి పాత్రలతో తెలుగు వారికి దగ్గరైన హీరోయిన్ సాయిపల్లవి.. ప్రస్తుతం తెలుగు, తమిళంలో నటిస్తూ బిజీగా ఉంది. అయితే గతంలో ఓసారి సినిమా షూటింగ్లో లిప్‌కిస్ పెట్టకుండా తప్పించుకున్న విషయాన్ని వెల్లడించింది.
లిప్‌కిస్ నుంచి అలా తప్పించుకున్నాను: సాయిపల్లవి
గతంలో ఓ సినిమా షూటింగ్లో హీరోతో లిప్‌కిస్ సీన్ చేయమని సాయిపల్లవికి చెప్పారట. అయితే దర్శకుడితో మాట్లాడి, ఆ సన్నివేశం చేయనని ఈమె చెప్పేసిందట. అప్పుడు ఇంకా ఏం జరిగిందంటే?
"నేను రొమాంటిక్ సినిమాలు చేస్తాను. కానీ లిప్‌లాక్ సన్నివేశాలు నచ్చవు. గతంలో ఓ చిత్రం షూటింగ్లో హీరో పెదాలపై గాఢంగా ముద్దు పెట్టాలని సదరు సీన్ గురించి ఓ దర్శకుడు చెప్పారు. అయితే అది నాకు నచ్చదని చేయనని చెప్పేశాను. అప్పుడే 'మీటూ' ఉద్యమం కూడా బాగా నడుస్తుండటం వల్ల లిప్‌లాక్ సీన్ చేయకుండా బయటపడ్డాను" అని సాయిపల్లవి చెప్పింది.
ప్రస్తుతం ఈమె రానాతో 'విరాటపర్వం', నాగచైతన్యతో 'లవ్‌స్టోరి' సినిమాలు చేస్తోంది. ఈమె నటించిన తమిళ వెబ్ సిరీస్ 'పావకథైగల్'.. నెట్‌ఫ్లిక్స్‌లో ఈనెల 18న విడుదల కానుంది.