తెలంగాణ

telangana

ETV Bharat / sitara

చైతూ-సాయిపల్లవి 'లవ్​స్టోరి' వినాయక చవితికే - తెలుగు మూవీ న్యూస్

లాక్​డౌన్ వల్ల వాయిదా పడుతూ వచ్చిన 'లవ్​స్టోరి' ఎట్టకేలకు రిలీజ్​ డేట్ ఫిక్స్ చేసుకుంది. వినాయక చవితి కానుకగా సెప్టెంబరు 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.

.
లవ్​స్టోరి మూవీ

By

Published : Aug 18, 2021, 11:20 AM IST

Updated : Aug 18, 2021, 1:16 PM IST

ఊహాగానాలే నిజమయ్యాయి. 'లవ్​స్టోరి' సినిమా థియేటర్లలోనే విడుదల కానుంది. సెప్టెంబరు 10న వినాయక చవితి కానుకగా గ్రాండ్​గా రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ విషయమే చెబుతూ కొత్త పోస్టర్​ను బుధవారం(ఆగస్టు 18) సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

.

ఇందులో తెలంగాణ కుర్రాడిగా చైతూ కనిపించనున్నారు. అతడి సరసన సాయిపల్లవి నటించింది. పూర్తిస్థాయి ప్రేమకథతో ఈ సినిమా తెరకెక్కించారు. 'ఫిదా' లాంటి బ్లాక్​బస్టర్​ తర్వాత దర్శకుడు శేఖర్​ కమ్ముల-సాయిపల్లవి కలిసి పనిచేస్తుండటం వల్ల ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. పవన్​.సీహెచ్​ సంగీతమందించగా, నారాయణ్​ దాస్ నారంగ్, పీ.రామ్మోహన్​ సంయుక్తంగా నిర్మించారు.

.

ఇవీ చదవండి:

Last Updated : Aug 18, 2021, 1:16 PM IST

ABOUT THE AUTHOR

...view details