తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'ప్రణవాలయ' సాంగ్‌ కోసం సాయిపల్లవి ఎంత కష్టపడిందో చూశారా? - సాయి పల్లవి

Sai Pallavi Dance: సాయి పల్లవి డ్యాన్స్​కు ఉండే క్రేజే వేరు. నెమలిలా ఆమె చేసే నృత్యానికి ప్రేక్షకులు ఫిదా అవుతుంటారు. ఇటీవలే 'శ్యామ్​ సింగరాయ్​'లో 'ప్రణవాలయ' సాంగ్​లో సాయి పల్లవి నాట్యం.. అందరి మనసు దోచేసింది. అయితే దానికి ఆమె ఎంత కష్టపడిందో తెలుసా?

sai pallavi dance
సాయి పల్లవి

By

Published : Jan 25, 2022, 6:13 PM IST

Sai Pallavi Dance: ప్రముఖ నటి సాయి పల్లవి డ్యాన్స్‌ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఆమె డ్యాన్స్‌ చేసే ప్రతీ పాటలోనూ.. తనదైన శైలిలో స్టెప్స్‌ వేస్తూ అందరి చూపును తనవైపు తిప్పుకొంటుంది. క్రిస్మస్‌ కానుకగా వచ్చిన 'శ్యామ్‌ సింగరాయ్‌'లో దేవదాసి పాత్రలో కనిపించారామె.

సాయి పల్లవి

గత శుక్రవారం నుంచి ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో సందడి చేస్తోంది. ఇందులోని 'ప్రణవాలయ' పాటలోని క్లాసికల్‌ డ్యాన్స్‌ సినిమాకే ప్రధాన ఆకర్షణగా నిలిచింది. తాజాగా ఈ పాటకు సంబంధించిన రెండు ప్రాక్టీస్‌ సెషన్స్‌ వీడియోలను సాయిపల్లవి అభిమానులతో పంచుకుంది.

"'ప్రణవాలయ' డ్యాన్స్‌ చేస్తున్నప్పుడు నా ఎమోషన్స్‌ గురించి చెప్పడానికి మాటలు సరిపోవు, ఈ పాట ద్వారా అద్భుతమైన డ్యాన్సర్స్‌తో కలిసి ప్రదర్శన ఇచ్చే అవకాశం వచ్చింది" అని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది.

'ప్రణావాలయ' గురించి మరింత వివరిస్తూ.. "ఈ పాటలో ఎంత కావాలో అంతే డ్యాన్స్‌ ఉంటుంది. నిజానికి నాకు క్లాసికల్‌ డ్యాన్స్‌ రాదు. ఇప్పటి వరకూ నేర్చుకోలేదు కూడా. కానీ, దర్శకుడు రాహుల్‌ నేను చేయగలనని నమ్మారు. ఇందులోని డ్యాన్స్‌ గ్రూప్‌లో ఉన్నవాళ్లంతా 10-20 ఏళ్ల నుంచి క్లాసికల్‌ డ్యాన్స్‌ చేస్తున్నవారే. అందుకే వాళ్లతో కలిసి డ్యాన్స్‌ చేస్తుంటే చాలా భయం వేసింది. మీరు ఆ సాంగ్‌ను గమనిస్తే.. అందరూ ఒకేలా చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఇదే నా విజయంలా భావిస్తా" అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేసింది సాయి పల్లవి.

ఇదీ చూడండి:స్టేజ్‌పైనే కన్నీళ్లు పెట్టుకున్న సాయిపల్లవి

ABOUT THE AUTHOR

...view details