సాయి పల్లవి.. తన కొంటె చూపులు, అల్లరి చేష్టలతో దక్షణాదిలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ భామ సినిమాల్లోనే కాకుండా బయట తన వ్యక్తిత్వంతోనూ ఎందరో అభిమానుల్ని సంపాదించుకుంది. ఎప్పుడూ సింపుల్‌గా కనిపించే పల్లవి.. చేతికి ఉడెన్ చైన్‌ను ధరిస్తుంటుంది. సంప్రదాయ, పాశ్చాత్య.. ఇలా ఏ దుస్తుల్లో ఉన్నా ఈ చైన్ మాత్రం ఉండాల్సిందే. అయితే తను ఆ చైన్ ఎందుకు పెట్టుకుంటుందో మాత్రం క్లారిటీ లేదు. అది తన సెంటిమెంట్ అంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. కింది ఫొటోలను చూస్తే మీకూ అర్థమవుతుంది.
సాయి పల్లవి చేతికి ఆ చైన్.. సెంటిమెంటేనా? - sai pallavi wooden chian
హీరోయిన్ సాయి పల్లవి సినిమాల్లోనే కాకుండా వ్యక్తిత్వంలోనూ సింపుల్‌గా ఉంటూ ఎందరో అభిమానుల్ని సంపాదించుకుంది. అయితే పల్లవి తన చేతికి మాత్రం ఒక ఉడెన్ చైన్‌ను ధరిస్తుంటుంది. మరి అది తన సెంటిమెంటా లేకపోతే ఎవరైనా ఇచ్చిన గిఫ్టా అనేది మాత్రం క్లారిటీ లేదు.
సాయి పల్లవి
ప్రస్తుతం సాయి పల్లవి తెలుగులో 'విరాట పర్వం' అనే చిత్రం చేస్తోంది. రానా హీరో. ప్రియమణి కీలకపాత్ర పోషిస్తోంది. వేణు ఊడుగుల దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే పల్లవి పుట్టినరోజు సందర్భంగా ఓ పోస్టర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. దీంతో పాటు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో 'లవ్‌స్టోరీ'లో నటించిందీ ముద్దుగుమ్మ. నాగ చైతన్య హీరోగా కనిపించనున్న ఈ సినిమా విడుదల కరోనా కారణంగా వాయిదా పడింది.
Last Updated : Jul 11, 2020, 1:13 PM IST