సినిమా సెట్‌లో ప్రముఖ నటుడు ప్రకాశ్‌రాజ్‌ను చూసి చాలా భయపడ్డానని కథానాయిక సాయిపల్లవి వెల్లడించారు. ఆమె నటించిన చిత్రం 'పావ కదైగల్'. తమిళ దర్శకులు గౌతమ్ మేనన్, వెట్రి మారన్, సుధా కొంగర, విఘ్నేశ్ శివన్.. నాలుగు కథలతో దీన్ని రూపొందించారు. సాయిపల్లవి తండ్రిగా ప్రకాశ్ రాజ్ నటించారు. సిమ్రన్, అంజలి, జయరాం, కల్కి కొచ్లిన్, గౌతమ్ మేనన్ తదితర పాత్రల్లో కనిపించనున్నారు. డిసెంబరు 18న చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కాబోతోంది.
సాయిపల్లవి తాజాగా ఓ ఆంగ్ల వెబ్‌సైట్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రకాశ్ రాజ్‌తో కలిసి పనిచేయడం గురించి ప్రశ్నించగా.. "తండ్రిగా ప్రకాశ్ రాజ్ సెట్‌లో నడుచుకుని వస్తుంటే.. ఆయన గాంభీర్యం చూసి చాలా భయపడేదాన్ని. ఆయన దాదాపు సెట్‌లో క్యారెక్టర్‌లో ఉండేవారు" అని అన్నారు.