తెలంగాణ

telangana

ETV Bharat / sitara

మంచి మనసు చాటుకున్న మెగాహీరో - సాయిధరమ్ తేజ్

మే 1న హైదరాబాద్​లో 'అవెంజర్స్ ఎండ్​గేమ్​'ను దివ్యాంగులు చూసేలా ప్రత్యేక ఏర్పాటు చేశాడు హీరో సాయిధరమ్ తేజ్.

మంచి మనసు చాటుకున్న మెగాహీరో

By

Published : Apr 29, 2019, 6:36 PM IST

ఇటీవలే చిత్రలహరి సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు సాయిధరమ్ తేజ్. తాజాగా మరోసారి అభిమానుల మనసు గెల్చుకున్నాడు. ఇటీవలే విడుదలై బాక్సాఫీస్ వద్ద అలరిస్తున్న హాలీవుడ్ చిత్రం 'అవెంజర్స్ ఎండ్​గేమ్'. ఈ సినిమా చూడాలని ఉందని కొందరు దివ్యాంగులు ఈ మెగాహీరో దగ్గరికి వచ్చారు. స్పందించిన సాయిధరమ్ తేజ్.. వారికి చిత్రాన్ని చూపించేందుకు సిద్ధమయ్యాడు. హైదరాబాద్​లో మే 1న ప్రత్యేక ప్రదర్శనను ఏర్పాటు చేశారు. సినిమాల్లోనే కాదు నిజజీవితంలోనూ హీరో అని నిరూపించుకున్నాడీ కథానాయకుడు.

ABOUT THE AUTHOR

...view details