మెగాహీరో సాయిధరమ్ తేజ్.. వరుసగా సినిమాలు చేస్తూ బిజీ అయిపోతున్నాడు. 'సోలో బ్రతుకే సో బెటర్' చేస్తూ ఇటీవలే కొత్త చిత్రాన్ని మొదలు పెట్టేశాడు. దేవకట్టా దర్శకత్వం వహిస్తున్నాడు. నివేదా పేతురాజ్ హీరోయిన్ నటిస్తోంది. అయితే ఇందులో మరో కథానాయికకు చోటుందని సమాచారం.
'సుప్రీమ్' జోడీ ఇప్పుడు మూడోసారి! - TOLLYWOOD NEWS
హిట్ జోడీగా పేరు తెచ్చుకున్న సాయితేజ్-రాశీఖన్నా, మరోసారి కలిసినటించనున్నారని టాక్. ప్రస్తుతం అందుకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని, త్వరలో అధికారిక ప్రకటన వస్తుందని టాక్.
'సుప్రీమ్' జోడీ ఇప్పుడు మూడోసారి!
ఈ సినిమాలోని మరో హీరోయిన్ పాత్ర కోసం రాశీఖన్నాను సంప్రదించారట. ఒకవేళ ఈమె ఒప్పుకుంటే ఈ హీరోతో కలిసి నటించబోయే మూడో సినిమా ఇది అవుతుంది. ఇంతకు ముందుకు వీరిద్దరూ 'సుప్రీమ్', 'ప్రతిరోజూ పండగే' చిత్రాల్లో కలిసి నటించారు.
ఇదీ చూడండి.. కరోనా ఎఫెక్ట్: నో యాక్షన్.. ఓన్లీ పేకప్