టాలీవుడ్ హీరోలు తమ బ్యాచ్‌లర్ లైఫ్‌కు గుడ్‌బై చెప్పేస్తున్నారు. ఒకరి తర్వాత ఒకరు పెళ్లి శుభవార్త వినిపిస్తున్నారు. ఈ లాక్డౌన్ సమయంలోనే నిఖిల్, నితిన్, రానా పెళ్లిళ్లు చేసుకుని ఓ ఇంటివారయ్యారు. ఇప్పుడు మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ వంతు వచ్చిందా అనే సందేహం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. ఇన్ని రోజులు 'సోలో బ్రతుకే సో బెటర్' అంటూ చెప్పిన తేజ్ ఇప్పుడు మనసు మార్చుకున్నాడా అనుకుంటున్నారు. తాజాగా ఈ హీరో నెట్టింట షేర్ చేసిన వీడియోతో ఈ అనుమానాలు రేకెత్తుతున్నాయి.
పెళ్లి శుభవార్తతో రెడీ అయిన సాయి తేజ్! - సాయి తేజ్ పెళ్లి
టాలీవుడ్ హీరో, మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ తాజాగా నెట్టింట ఓ వీడియో షేర్ చేశాడు. ఇది అతడి పెళ్లికి సంబంధించిందా లేక 'సోలో బ్రతుకే సో బెటర్' సినిమాకు సంబంధించిందా అనే అనుమానంలో ఉన్నారు అభిమానులు.
పెళ్లి శుభవార్తతో రెడీ అయిన సాయి తేజ్
సింగిల్ ఆర్మీ అనే వాట్సప్ గ్రూప్ నుంచి ఒక్కొక్క హీరో లెఫ్ట్ అవుతున్నట్లు ఉన్న యానిమేషన్ వీడియో ఆకట్టుకుంటోంది. చివర్లో 'సారీ ప్రభాస్ అన్న' అంటూ తేజ్ ముగించాడు. సోమవారం ఉదయం 10 గంటలకు శుభవార్త చెబుతా అంటూ వెల్లడించాడు. దీనిపై నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. 'ఇది సోలో బ్రతుకే సో బెటర్ సినిమా ప్రమోషన్స్ కదా' అంటూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Last Updated : Aug 23, 2020, 11:01 AM IST