తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఫుల్ జోష్​లో తేజ్.. మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్! - దేవా కట్ట

వరుస సినిమాలతో బిజీ అవుతున్నాడు మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్. దేవకట్టా దర్శకత్వంలో కొత్త సినిమా షూటింగ్​ ప్రారంభించడానికి ముందే.. మరో సినిమాకు తేజ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.

Sai Dharam Tej
మరో సినిమాకు ఓకే చెప్పిన సాయితేజ్

By

Published : Dec 6, 2020, 7:03 PM IST

Updated : Dec 6, 2020, 7:42 PM IST

వరుస సినిమాలతో బిజీ అయిపోతున్నాడు మెగా యువ హీరో సాయి ధరమ్ తేజ్. తాను నటించిన 'సోలో బ్రతుకే సో బెటర్' సినిమా డిసెంబర్ 25న విడుదలకు సిద్ధం కానున్న నేపథ్యంలో కొత్త సినిమాలకు ఓకే చెబుతున్నాడు. ప్రస్తుతం, విలక్షణ దర్శకుడు దేవ కట్టా దర్శకత్వంలో ఓ సినిమా ప్రారంభించనున్నాడు సాయితేజ్. ఇది ఇంకా పట్టాలెక్కకముందే మరో సినిమాకు సాయి సంతకం చేసినట్లు సమాచారం.

దర్శకుడు కృష్ణవంశీ అసిస్టెంట్​ డైరెక్టర్ రామ్​ చెప్పిన కథకు తేజ్ సై అన్నట్లు తెలుస్తోంది. గతంలో తేజ్.. కృష్ణవంశీతో పనిచేసినప్పుడు రామ్​తో పరిచయం ఏర్పడిందట.

ఇదీ చదవండి:'ఆదిపురుష్​' వివాదంపై సైఫ్ క్షమాపణలు

Last Updated : Dec 6, 2020, 7:42 PM IST

ABOUT THE AUTHOR

...view details