ఇటీవలే చిత్రలహరి సినిమాతో ఫామ్లోకి వచ్చాడు హీరో సాయిధరమ్ తేజ్. త్వరలో కొత్త చిత్రాన్ని ప్రారంభించనున్నాడు. గీతా ఆర్ట్స్ నిర్మిస్తోంది. మారుతి దర్శుకుడు. హీరోయిన్గా రాశీఖన్నా ఎంపికైంది. 'ప్రతిరోజూ పండగే' అనే టైటిల్ను చిత్రబృందం ఖరారు చేసింది.
'ప్రతిరోజూ పండగే' అంటున్న హిట్ జోడీ - సుప్రీం సినిమా
సాయిధరమ్ తేజ్ కొత్త సినిమాకు 'ప్రతిరోజూ పండగే' అనే టైటిల్ను ఖరారు చేసింది చిత్రబృందం. హీరోయిన్గా రాశీఖన్నా నటించనుంది.
'ప్రతిరోజూ పండగే' అంటున్న హిట్ జోడీ
ఈ నెల 27 నుంచి సెట్స్ మీదకు వెళ్లనుంది చిత్రం. తేజు-రాశీ జోడీ ఇప్పటికే 'సుప్రీం'తో ఆకట్టుకున్నారు. మరోసారి మురిపించేందుకు సిద్ధమవుతున్నారు. సినిమాను సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తెచ్చే అవకాశముంది.
ఇది చదవండి: ఓ సినిమా కోసం ముగ్గుర్ని ఒప్పించిన హీరో సందీప్ కిషన్