హీరో సాయిధరమ్ తేజ్ ప్రమాదంపై సీనియర్ నటుడు నరేశ్ చేసిన వ్యాఖ్యలు సినీ పరిశ్రమలో వివాదంగా మారుతున్నాయి. బైక్ రేసింగ్ విషయాన్ని ప్రస్తావిస్తూ ఆయన వీడియో విడుదల చేయడంపై విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో మరోసారి వివరణ ఇస్తూ నరేశ్ వీడియో విడుదల చేశారు.
విమర్శలపై స్పందించిన నరేశ్.. మరో వీడియో రిలీజ్ - సాయిధరమ్ తేజ్ హెల్త్
హీరో సాయిధరమ్ తేజ్ ప్రమాదం విషయంలో నరేశ్ వ్యాఖ్యలు విమర్శలకు దారితీశాయి. దీంతో ఆయన వివరణ ఇచ్చారు.
నరేశ్
తన కుమారుడు నవీన్ విజయ్ కృష్ణ, సాయితేజ్ ఒక ఛాయ్ దుకాణం ప్రారంభోత్సవానికి వెళ్లి ఎవరికి వారే వస్తున్నారని, రేసింగ్‌లో లేరని నరేశ్ స్పష్టం చేశారు. రోడ్డుపై ఉన్న మట్టి వల్లే సాయితేజ్ ప్రమాదానికి గురయ్యాడని, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయలేదని వివరణ ఇచ్చారు. సాయితేజ్ త్వరగా కోలుకుని బాగుండాలన్నదే తన ఉద్దేశమని, వేరే ఆలోచన లేదని తెలిపారు.
ఇవీ చదవండి: