మెగాహీరో సాయితేజ్.. వృద్ధులకు చేయూతగా నిలిచేందుకు ముందుకొచ్చారు. తన సొంత నిధులతో విజయవాడలో నిర్మించిన అమ్మ ప్రేమ ఆదరణ వృద్ధాశ్రమం బిల్డింగ్‌ను ప్రారంభించారు. ఈ విషయమై మెగా అభిమానులు సాయిపై ప్రశంసిస్తున్నారు.
వృద్ధాశ్రమానికి మెగాహీరో సాయితేజ్ చేయూత - Sai Dharam Tej inaugurated Old Age Home
యువ కథానాయకుడు సాయితేజ్.. విజయవాడలో సందడి చేశారు. ఓ వృద్ధాశ్రమ ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. ప్రస్తుతం ఇతడు నటించిన ఓ సినిమా విడుదలకు సిద్ధమైంది.
హీరో సాయితేజ్
సాయితేజ్ నటించిన 'సోలో బ్రతుకే సో బెటర్' సినిమా విడుదలకు సిద్ధమైంది. ఈనెల 25 థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా శనివారం(డిసెంబరు 19) ఉదయం 11 గంటలకు ట్రైలర్‌ను అభిమానులతో పంచుకోనున్నారు.