ప్రభాస్, శ్రద్ధాకపూర్ ప్రధానపాత్రల్లో నటించిన చిత్రం 'సాహో'. భారీ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. అందుకు తగ్గట్టుగానే ప్రమోషన్స్‌లో దూకుడు పెంచింది చిత్రబృందం. ఇప్పటికే షేడ్స్ ఆఫ్ సాహో, టీజర్, సాంగ్ విడుదల చేసింది. తాజాగా సినిమా నుంచి కొత్త రొమాంటిక్ పోస్టర్ వదిలింది.
ఈ పోస్టర్ ప్రభాస్ అభిమానులకు కనువిందు చేసేలా ఉంది. హీరోహీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ చాలా బాగుందని, సినిమా కొత్తగా ఉండబోతోందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్.