తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'మాట ఇవ్వకుండా సినిమా చేయాలనిపిస్తోంది'

"ఏడాదికి రెండు సినిమాలు చేస్తానని ఇంతకు ముందుమాట ఇచ్చా. కాని చేయలేకపోయా. కచ్చితంగా ఈ సారి మాట ఇవ్వకుండా చేయాలనుకుంటున్నా" అని చెప్పుకొచ్చాడు హీరో ప్రభాస్​. ఆదివారం చిత్ర ప్రీరిలీజ్‌ వేడుక రామోజీ ఫిల్మ్‌ సిటీలో ఘనంగా జరిగింది.

'మాట ఇవ్వకుండా సినిమా చేయాలనిపిస్తోంది'

By

Published : Aug 19, 2019, 6:32 AM IST

Updated : Sep 27, 2019, 11:35 AM IST

రెబల్​స్టార్​ ప్రభాస్​ నటించిన చిత్రం 'సాహో' సినిమా ప్రీరిలీజ్‌ వేడుక రామోజీ ఫిల్మ్‌ సిటీలో ఘనంగా జరిగింది. కార్యక్రమంలో మాట్లాడిన ప్రభాస్​ పలు విషయాలు వెల్లడించాడు.

"ఈ సినిమాకు పెద్ద టెక్నీషియన్లు పనిచేశారు. మది, సాబు‌, శ్రీకర్‌‌, కమల్‌ గార్ల సహకారం మర్చిపోలేనిది. కథ విన్న తర్వాత జాకీష్రాఫ్‌, అరుణ్‌ విజయ్‌, నీల్‌ నితిన్‌, మందిరాబేడి వంటి నటులు వెంటనే ఒప్పుకొన్నారు. సుజీత్‌ కథ చెప్పడానికి వచ్చినప్పుడు నిక్కరేసుకొని వచ్చాడు. అప్పుడు అతడికి 24 ఏళ్లు. అప్పటికే మా ప్రొడక్షన్‌లో 'రన్‌ రాజా రన్‌' చేశాడు. అందరికీ నచ్చింది. 40ఏళ్ల అనుభవం ఉన్న వ్యక్తిలా నాకు కథ చెప్పాడు. షూటింగ్‌ ప్రారంభమవడానికి ఏడాది ముందే చాలా వర్క్‌ చేశాడు. కొంతమంది ప్రముఖ డైరెక్టర్లను కలిసి.. యాక్షన్‌ సన్నివేశాలు ఎలా తీయాలో వాళ్లతో ముందే ప్లాన్‌ చేశాడు. పెద్ద టెక్నిషియన్లను తీసుకొని చాలా చక్కగా హ్యాండిల్‌ చేశాడు. కథానాయిక శ్రద్ధాకపూర్‌ రెండేళ్ల పాటు ఎలాంటి ఇబ్బంది లేకుండా మాతో పనిచేసింది. ముంబయి నుంచి వస్తూ ఒక్కరోజు కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు. యాక్షన్‌ సన్నివేశాలు అదరగొట్టేసింది. తను సాహోకు పనిచేయడం మా అదృష్టం. ఏడాదికి రెండు సినిమాలు చేస్తానని మాటిచ్చా. కానీ, ఈసారి మాటివ్వకుండా చేయాలనుకున్నా. ట్రైలర్‌లో చూశారుగా ఛేజింగ్‌లు, జెట్‌లు.. అందుకే సమయం పట్టింది. నిర్మాతలు వంశీ, ప్రమోద్‌లాంటి స్నేహితులు అందరికీ ఉండాలి. రూ.100కోట్ల ప్రాఫిట్‌ను వదులుకుని మరీ సినిమా చేశారు ".
-- రెబల్​స్టార్​ ప్రభాస్​, హీరో

"ఈ సినిమాలో ఫ్యాన్స్‌.. డైహార్డ్‌ ఫ్యాన్స్‌ అన్న డైలాగ్‌ రాసింది సుజీత్‌. మాస్‌ పల్స్‌ ఏంటో అతనికి తెలుసు’’ అని దర్శకుడిపై ప్రశంసలు కురిపించాడు ప్రభాస్​. కార్యక్రమంలో దర్శకధీరుడు రాజమౌళి మాట్లాడారు. ఈ సినిమాతో ప్రభాస్ ఇమేజ్​​ మరో మెట్టు ఎక్కుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

" సాధారణంగా ఏ హీరో అభిమాని అయినా తన హీరో సినిమా హిట్‌ కావాలని కోరుకుంటాడు. కానీ అందరి హీరోల అభిమానులు ప్రభాస్‌ సినిమా హిట్‌ కావాలని కోరుకుంటారు. ఎందుకంటే ప్రభాస్‌ అన్ని విషయాల్లోనూ పాజిటివ్‌గా ఉంటాడు. 'బాహుబలి' తీస్తున్న సమయంలోనే తన తర్వాత చిత్రమేంటో ప్రభాస్‌ ఆలోచించాడు. ఒక రోజు నా దగ్గరకు వచ్చి సుజీత్‌ కథ గురించి నాకు చెప్పాడు. నాకు బాగా నచ్చింది.పెద్ద సినిమా చేసిన తర్వాత పెద్ద డైరెక్టర్‌తో చేయాలని కాకుండా... సుజీత్‌ చెప్పిన కథను నమ్మి ఈ సినిమా చేశాడు. ఒక ప్రొఫెషనల్‌ డైరెక్టర్‌లా సుజీత్​ ఈ సినిమా చేశాడు. ఇలాంటి చిత్రం తీయాలంటే నిర్మాతలకు ఎంతో ధైర్యం ఉండాలి. నిజంగా వాళ్ల అభినందిస్తున్నా. ఆగస్టు 30న పెద్ద రికార్డులు సృష్టిస్తుంది. ప్రభాస్‌ ఇప్పటికే ఆలిండియా స్టార్‌. ఇక సినిమాతో ఎంతో మరో మెట్టు ఎదుగుతాడు ".

-- దర్శకధీరుడు రాజమౌళి

'సాహో' సినిమా ఆగస్టు 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. యూవీ క్రియేషన్స్‌ పతాకంపై వంశీ, ప్రమోద్‌, భూషణ్‌ నిర్మిస్తున్నారు.

Last Updated : Sep 27, 2019, 11:35 AM IST

ABOUT THE AUTHOR

...view details