ప్రభాస్ నటించిన 'సాహో' చిత్రం నుంచి కొత్త పోస్టర్ విడుదలైంది. యాక్షన్ ఫోజులో మిర్చి కుర్రాడు, శ్రద్ధా అదరగొట్టేశారు. దాదాపు 350 కోట్ల బడ్జెట్‌తో భారీ యాక్షన్ సన్నివేశాలతోసుజీత్ దర్శకత్వంలో ఈసినిమా రూపొందుతోంది. ప్రస్తుతం నిర్మాణంతర కార్యక్రమాల్లో బిజీగా ఉండగా... ఆగస్ట్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.
సాహో సినిమా కొత్త పోస్టర్ తొలుత ఆగస్ట్ 15న సినిమా విడుదల చేయాలనుకున్నారు. విజువల్ ఎఫెక్ట్స్ పూర్తికావడానికి కొంత సమయం అవసరమై మరో 15 రోజులు పొడిగించారు. ఈ సమయంలో చిత్రబృందం రోజూ విభిన్నమైన ప్రచార వ్యూహాలతో ప్రేక్షకులకు చేరువవుతోంది. రెండు రోజుల క్రితం సాహో చిత్రానికి సంబంధించి రొమాంటిక్ పోస్టర్ విడుదల చేసిన మేకర్స్... ప్రస్తుతం యాక్షన్ సీన్‌కి సంబంధించిన పోస్టర్‌ను రిలీజ్ చేశారు.
యూవీ క్రియేషన్స్ ట్వీట్
" ఇంతకుముందెన్నడూ చూడని, ఉత్కంఠగా సాగే యాక్షన్ సన్నివేశాలు మీ ముందుకు రానున్నాయి. భారతదేశంలోనే భారీ యాక్షన్ థ్రిల్లర్‌ను ఆగస్ట్‌లో తీసుకొస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఆగస్ట్ 30న సినిమా విడుదల కానుంది".
-- యూవీ క్రియేషన్స్, చిత్ర నిర్మాణ సంస్థ
ఇప్పటికే విడుదలైన మేకింగ్ వీడియోలు, టీజర్లు సినిమాపై భారీ ఆసక్తిని పెంచాయి. సాహో చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళ, హిందీ, మలయాళ భాషల్లోనూ విడుదల చేస్తున్నారు. నీల్ నితిన్ ముఖేష్, ఎవ్లిన్ శర్మ, మురళీ శర్మ, జాకీ ష్రాఫ్, మందిరా బేడీ లాంటి బాలీవుడ్ స్టార్స్ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. 'శంకర్ ఎహసాన్ లాయ్' బృందం తప్పుకున్న తర్వాత ఈ చిత్రానికి జిబ్రాన్ సంగీతం సమకూర్చాడు.