తెలంగాణ

telangana

ETV Bharat / sitara

టీజర్​కు 'సాహో' అంటున్న సెలెబ్రిటీలు - saho

సాహో టీజర్ అదిరిపోయిందంటూ చిత్రబృందానికి ట్విట్టర్లో శుభాకాంక్షలు తెలిపారు టాలీవుడ్ ప్రముఖులు. టీజర్ బాగుందంటూ ప్రశంసించారు.

ప్రభాస్

By

Published : Jun 13, 2019, 3:16 PM IST

Updated : Jun 13, 2019, 7:26 PM IST

ప్రభాస్ హీరోగా తెరెకెక్కిన భారీ బడ్జెట్ చిత్రం సాహో. నేడు విడుదలైన ఈ సినిమా టీజర్ ప్రేక్షకుల్ని అలరిస్తోంది. ఇప్పటికే 10 లక్షల మందికి పైగా ఈ టీజర్​ను వీక్షించారు. యాక్షన్ థ్రిల్లర్​గా తెరకెక్కిన ఈ చిత్రటీజర్​పై టాలీవుడ్ ప్రముఖులు స్పందించారు. ప్రభాస్ ఇరగదీశాడు అంటూ ప్రశంసించారు.

"సాహో టీజర్ టెర్రిఫిక్​గా ఉంది. నిర్మాతల బడ్జెట్​కు సుజీత్ న్యాయం చేశాడు. తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాడు. ప్రభాస్ బలం ఇందులో కనిపిస్తోంది" - ఎస్​ ఎస్ రాజమౌళి

"సాహో చిత్రంతో హద్దులను చెరిపేసి ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు ప్రభాస్" - నాగార్జున

"భారత్​లోనే అతిపెద్ద యాక్షన్ థ్రిల్లర్​ చిత్రం 'సాహో'. తెలుగు నుంచి మరో భారీ సినిమా రాబోతుంది. హాలీవుడ్​ చిత్రాలను తలపించే విజువల్స్​తో ముందుకు వస్తోంది" - అల్లు శిరీష్

"మరో కొత్త స్థాయిని సెట్ చేసింది సాహో. చిత్రబృందానికి శుభాకాంక్షలు.. సినిమా బ్లాక్​ బాస్టర్ అవుతుంది" -సాయి ధరమ్​ తేజ్​, హీరో

"అదిరిపోయింది.. తెలుగు సినిమా ఎక్కడికో వెళ్లిపోయింది ప్రభాస్ అన్నా" -సందీప్ కిషన్

శ్రద్ధాకపూర్ హీరోయిన్​గా నటిస్తున్న 'సాహో' చిత్రం ఆగస్టు 15న రానుంది. సుజీత్ దర్శకత్వం. యూవీ క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతోంది.

Last Updated : Jun 13, 2019, 7:26 PM IST

ABOUT THE AUTHOR

...view details