రెబల్‌స్టార్ ప్రభాస్ సినీ ప్రియులకు కాస్త నిరాశ కలిగించే వార్త వినిపించబోతున్నాడా అంటే అవుననే అంటున్నాయి చిత్రసీమ వర్గాలు. ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న 'సాహో' సినిమా అనుకున్న సమయానికి రాకపోవచ్చని సమాచారం. ఇప్పటికే ఈ మూవీని ఆగస్టు 15న విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఇందుకు తగ్గట్లుగానే నిర్మాణాంతర పనులు శరవేగంగా సాగుతున్నాయి. కానీ విడుదల తేదీకి కొద్ది రోజులే సమయం ఉండటం వల్ల డబ్బింగ్, విజువల్ ఎఫెక్ట్స్ పూర్తి కావడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉందట. ఫలితంగా 15 రోజులు ఆలస్యంగా సినిమా థియేటర్లలో రానున్నట్లు తెలుస్తోంది.
ప్రభాస్ 'సాహో' విడుదల మరింత ఆలస్యం! - prabhas
టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ నటించిన చిత్రం 'సాహో'. జులై 15న చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం కాస్త ఆలస్యంగా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం. ఆగస్ట్ 15న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు చిత్రబృందం ఇది వరకే ప్రకటించినా... నిర్మాణాంతర పనుల వల్ల 15 రోజులు వాయిదా వేయాలని నిర్మాతలు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.
![ప్రభాస్ 'సాహో' విడుదల మరింత ఆలస్యం!](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3856317-688-3856317-1563285370851.jpg)
ఆగస్ట్ 30న ప్రభాస్ 'సాహో' విడుదల..!
వేడుకలూ ముఖ్యమే..
ఈ చిత్రం వివిధ భాషల్లోనూ ఏకకాలంలో విడుదల కానుంది. వీటికి సంబంధించిన ప్రీరిలీజ్ కార్యక్రమాలు ఎలా నిర్వహించాలి? ఎక్కడ నిర్వహించాలి? అనే విషయాలపై చిత్ర యూనిట్‌కు సరైన క్లారిటీ రాలేదట. కాబట్టి ఇంతటి ఒత్తిడి మధ్య అనుకున్న పనులన్నీ పూర్తి చేయడం కష్టమని భావించిన నిర్మాతలు... రిలీజ్ డేట్‌ను వాయిదా వేసుకోవడమే మంచిదని తేల్చుకున్నారట. ఆగస్టు 30న సినిమా విడుదల చేయాలని అనుకుంటున్నట్లు సమాచారం. త్వరలోనే దీనిపై చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది.
Last Updated : Jul 16, 2019, 8:00 PM IST