సాహో విడుదల దగ్గరపడుతున్న కొద్ది ప్రచార వేగాన్ని పెంచింది చిత్రబృందం. ఇప్పటికే ముంబయి, హైదరాబాద్ సహా పలు నగరాల్లో విస్తృతంగా ప్రమోషన్లలో పాల్గొంటున్నారు ప్రభాస్, శ్రద్ధాకపూర్. తాజాగా చిత్ర విడుదల ముందస్తు వేడుకను ఆగస్టు 18న నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి హైదరాబాద్ రామోజీ ఫిల్మ్‌సిటీ వేదిక కానుంది. సాయంత్రం 5గంటలకు ప్రారంభం కానుంది.
సాహో ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హీరోహీరోయిన్లు సహా చిత్రప్రముఖులు హాజరు కానున్నారు. ఇప్పటికే సాహో వీడియో గేమ్ టీజర్‌నూ విడుదల చేసింది చిత్రబృందం. ఈ గేమ్‌ను గురువారం ఆవిష్కరించనున్నారు.