తెలంగాణ

telangana

By

Published : Mar 22, 2021, 10:34 AM IST

ETV Bharat / sitara

ప్రముఖ రచయిత,దర్శకుడు సాగర్ కన్నుమూత

బాలీవుడ్​లో పలు హిట్​ చిత్రాలకు రచయితగా, దర్శకుడిగా పనిచేసి గుర్తింపు తెచ్చుకున్న సాగర్ సర్హాదీ కన్నుమూశారు. ఆయన అంత్యక్రియలు సోమవారం జరగనున్నాయి.

Sagar Sarhadi dead
ప్రముఖ దర్శకుడు సాగర్ కన్నుమూత

బాలీవుడ్​ ప్రముఖ దర్శకుడు సాగర్ సర్హాదీ(88).. అనారోగ్య సమస్యలతో ఆదివారం రాత్రి మృతి చెందారు. ఆయన మేనల్లుడు, దర్శకుడు రమేశ్ తల్వార్ ఈ విషయాన్ని వెల్లడించారు.

పాకిస్థాన్​లో పుట్టిన సాగర్.. 12 ఏళ్లున్నప్పుడు కుటుంబంతో సహా దిల్లీకి వలస వచ్చారు. ఉర్దూ కథారచయితగా కెరీర్​ ప్రారంభించారు. అమితాబ్ నటించిన 'కబీ కబీ'(1976) సినిమాతో బాలీవుడ్​లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత సిల్​సిలా, చాందిని చిత్రాలతో రచయితగా గుర్తింపు తెచ్చుకున్నారు. బజార్(1982) సినిమాతో దర్శకుడిగా మారి ప్రేక్షకులను మెప్పించారు.

ప్రముఖ దర్శకుడు సాగర్ సర్హాదీ

ABOUT THE AUTHOR

...view details