ఆస్కార్ అకాడమీ అవార్డుల నామినేషన్లో ఉన్నందుకు తనకెంతో ఆనందంగా ఉందని హాలీవుడ్ నటి సింథియా ఎరివో తెలిపింది. కానీ, ఈ పోటిలో ఉన్న ఏకైక నల్లజాతీయురాలిని కావటం బాధాకరమని ఆమె పేర్కొంది. ఆమె నటించిన 'హ్యరియట్' చిత్రానికి గానూ ఆస్కార్ నామినేషన్ల బరిలో ఉంది.
"ఇది వేడుకలకు ముందు ఒక్క క్షణం కనువిప్పు కలిగించింది. ఇలా నేను ఒంటరిగా ఉండకూడదు. ఇంత మంచి పని జరుగుతున్నా.. ప్రాణాంతకమని అనిపించవచ్చు. మేము గులాబీలు ఇచ్చి ఉండాలని కోరుకున్నా వాటిని స్వీకరించేవారు లేరు. నామినేట్ అయిన వారంతా ఒకే గదిలో ఉండటం ఇతర నటులను చూడలేకపోవడం, మరొక నల్ల జాతీయురాలితో నామినేషన్లు పంచుకోలేకపోవడం బాధ కలిగించింది."
- సింథియా ఎరివొ, హాలీవుడ్ నటి.