తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'సడక్ 2' ట్రైలర్​కు విపరీతంగా 'డిస్​లైక్స్'

ఆలియా భట్ 'సడక్ 2' ట్రైలర్​కు విపరీతమైన వ్యతిరేకత వస్తోంది. లైకుల కంటే డిస్​లైక్స్​ దాదాపు పదిరెట్లు ఎక్కువగా ఉన్నాయి.

ఆలియా సినిమా ట్రైలర్​కు విపరీతంగా 'డిస్​లైక్స్'
ఆలియా భట్ సడక్ 2 ట్రైలర్

By

Published : Aug 12, 2020, 2:26 PM IST

బాలీవుడ్​ సినిమా 'సడక్ 2' ట్రైలర్ విడుదలైంది. వీక్షకులు మాత్రం చూసి ఎలా ఉందో చెప్పడానికి బదులు భారీగా డిస్​లైక్స్ కొడుతున్నారు. సుశాంత్ ఆత్మహత్య విషయంలో విమర్శలు ఎదుర్కొంటున్న మహేశ్ భట్ (దర్శకుడు), ఆలియా భట్(హీరోయిన్​)​.. ఈ సినిమాకు పనిచేయడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.

1991లో వచ్చిన 'సడక్'కు సీక్వెల్ ఈ సినిమా. ఇందులో సంజయ్ దత్, ఆలియా భట్, ఆదిత్య రాయ్ కపూర్ ప్రధాన పాత్రలు పోషించారు. దొంగబాబాల నేపథ్య కథతో దీనిని తెరకెక్కించారు. మహేశ్ భట్ దర్శకత్వం వహించగా, ముకేశ్ భట్ నిర్మించారు. త్వరలో ఓటీటీ వేదికగా చిత్రం విడుదల కానుంది. తండ్రి మహేశ్​భట్ దర్శకత్వంలో ఆలియా నటిస్తున్న తొలి సినిమా ఇదే కావడం విశేషం.

ABOUT THE AUTHOR

...view details