తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'సడక్​ 2' సింగర్​ లీనా బోస్​కు కరోనా - latest corona news updates

'సడక్​ 2' చిత్రంలో 'తుమ్​ సే హాయ్'​ వంటి సూపర్​ హిట్​ సాంగ్​ పాడిన లీనా బోస్​కు కరోనా పాజిటివ్​గా తేలింది. ప్రస్తుతం హోమ్​ క్వారంటైన్​లో ఉన్నట్లు తెలిపిందీ గాయని.

Leena Bose
లీనా బోస్​

By

Published : Sep 7, 2020, 7:45 PM IST

బాలీవుడ్​ గాయని లీనా బోస్​కు కరోనా సోకింది. ప్రస్తుతం కోల్​కతాలోని తన నివాసంలో హోమ్​ క్వారంటైన్​లో ఉంటున్నట్లు తెలిపిందీ సింగర్. 'సడక్​ 2' చిత్రంలో అంకిత్​ తివారీతో కలిసి 'తమ్​ సే హాయ్'​ అనే రొమాంటిక్​ హిట్​ సాంగ్​ పాడింది. దీంతో ఇటీవల కాలంలో వార్తల్లో ప్రధాన ఆకర్షణగా నిలిచింది.

"ఇటీవలే నేను పాడిన సాంగ్​ రిలీజ్​ అయింది. ఈ క్రమంలోనే జాగ్రత్తలన్నీ పాటిస్తూ అనేక ఇంటర్వ్యూలు ఇచ్చా. దురదృష్టవశాత్తు ఒక రోజు నేను ఇంటికి రాగానే.. ఆరోగ్యం సన్నగిల్లింది. వైరల్​ ఫీవర్​ అయ్యుంటుందిలే అని విశ్రాంతి తీసుకున్నా. కానీ కొన్ని రోజుల తర్వాత మరింత ఎక్కువయింది. వెంటనే కరోనా పరీక్షలు చేయించుకోగా.. పాజిటివ్ తేలింది."

-లీనా బోస్​, బాలీవుడ్​ సింగర్​

తన కుటుంబ సభ్యులు కూడా టెస్టులు చేయించుకోనున్నట్లు లీనా తెలిపింది. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉందని.. వైద్యుల సూచన మేరకు చికిత్స తీసుకుంటున్నట్లు పేర్కొంది.

ABOUT THE AUTHOR

...view details