తెలంగాణ

telangana

ETV Bharat / sitara

థియేటర్ ప్రమాదంపై నాని ఆవేదన.. మహేశ్ సినిమా గుర్తుచేసుకొని... - టక్కరి దొంగ

కూకట్​పల్లిలోని శివపార్వతి థియేటర్ లో అగ్నిప్రమాదంపై హీరో నాని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ థియేటర్​తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ ట్వీట్ చేశారు.

Nani
mahesh babu

By

Published : Jan 3, 2022, 9:34 PM IST

కూకట్​పల్లిలోని శివపార్వతి థియేటర్​లో అగ్నిప్రమాదంపై యువ కథానాయకుడు నాని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదం జరగడం బాధాకరమన్న నాన్ని.... ఆ థియేటర్​తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ ట్వీట్ చేశారు. శివపార్వతి థియేటర్​లో మహేశ్ బాబు నటించిన టక్కరి దొంగ చిత్రాన్ని తొలిరోజు పిచ్చిపిచ్చిగా చూశామని గుర్తుచేసుకున్న నాని... ఈ రోజు ఆ థియేటర్ అగ్నికి ఆహుతి కావడం బాధ కలిగించిందన్నారు. అయితే ఎలాంటి ప్రాణ నష్టం కలగకపోవడం పట్ల ఊపిరిపిల్చుకున్నట్లు తెలిపారు.

తన తాజా చిత్రం శ్యామ్ సింగరాయ్ మంచి కలెక్షన్లతో ఆ థియేటర్​లో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. రోజుకు సుమారు 4 లక్షల కలెక్షన్లు వస్తున్న క్రమంలో నిన్న అర్థరాత్రి అగ్నిప్రమాదంలో థియేటర్ బుగ్గిపాలు కావడం పట్ల ట్విట్టర్​లో నాని తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి:'శ్యామ్​సింగరాయ్'తో అది సాధ్యమైంది: నాని

ABOUT THE AUTHOR

...view details