తెలంగాణ

telangana

ETV Bharat / sitara

మురళీధరన్​ బయోపిక్​లో నటించనున్న సచిన్! - లిటిల్​ మాస్టర్​ సచిన్

శ్రీలంక దిగ్గజ ఆటగాడు ముత్తయ్య మురళీధరన్ జీవితకథ ఆధారంగా తెరకెక్కుతోన్న సినిమాలో మాస్టర్​ బ్లాస్టర్​ సచిన్​ తెందూల్కర్​ నటించనున్నాడట. ఈ చిత్రంలో విజయ్​ సేతుపతి  హీరో. రానా దగ్గుబాటి  నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.

మురళీధరన్​ బయోపిక్​లో సచిన్​..!

By

Published : Aug 2, 2019, 4:06 PM IST

లంక స్పిన్నర్​ ముత్తయ్య మురళీధరన్​ బయోపిక్‌ త్వరలో పట్టాలెక్కనుంది. ముత్తయ్య పాత్రలో తమిళ కథానాయకుడు విజయ్ సేతుపతి నటించనున్నాడు. శ్రీపతి రంగస్వామి దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంలో టీమిండియా మాజీ ఆటగాడు సచిన్ కనిపించనున్నాడట.

మురళీధరన్​, లిటిల్​ మాస్టర్​ సచిన్​ మధ్య జరిగిన సన్నివేశాల కోసం స్వయంగా సచిన్ అతిథి పాత్రలో కనిపిస్తాడట. సురేష్​ ప్రొడక్షన్స్​, దార్​ ఫిల్మ్స్​తో కలిసి సంయుక్తంగా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు వెల్లడించాడు హీరో రానా. ఇప్పటికే సినిమా కోసం కసరత్తులు ప్రారంభమయ్యాయి. ముత్తయ్య సమక్షంలో విజయ్​ శిక్షణ తీసుకుంటున్నాడట.

ఇవీ చూడండి...'ముద్దు సీన్ల కోసం సినిమాలు చూస్తారని అనుకోను'

ABOUT THE AUTHOR

...view details